కరూర్ తొక్కిసలాటపై టీవీకే పార్టీ వేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ప్రారంభ దశలోనే సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని వెల్లడించింది. ఈ సందర్భంగా న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. సభలు, సమావేశాలకు అనుమతుల విషయంలో తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ టీవీకే పిటిషన్ను తోసిపుచ్చింది.