W.G: ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 31 మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 9 మంది భార్యాభర్తల కోటాలో, 22 మంది పరస్పర బదిలీ ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వీరందరూ శుక్రవారం కొత్తగా చేరే జిల్లాల్లో రిపోర్ట్ అవ్వాలని డీఈవో వెంకటలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.