కృష్ణా: ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు ప్రయోజనం చూకూరుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులకు కలిగే ప్రయోజనాలను వ్యవసాయ శాఖ అధికారులు వివరించాలని ఆయన సూచించారు.