NLR: మనుబోలులోని విష్ణు దేవాలయంలో ఏకాదశి సందర్భంగా శుక్రవారం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీచెన్నకేశవ స్వామివార్లకు ఆలయ అర్చకులు హనుమాచార్యులు వేకువజామున సుప్రభాత సేవ చేపట్టారు. పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.