ప్రకాశం: పెదచెర్లోపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో పిఎసిఎస్ ఛైర్మన్ పరిమి ఈశ్వరరావు శుక్రవారం రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతులకు రుణాలను అందించడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సొసైటీ బ్యాంకు ద్వారా రైతులకు అందే సేవలను ఆయన వివరించారు.