TG: మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో తెలంగాణ వంటకాలు నోరూరిస్తున్నాయి. 40 క్వింటాళ్ల చికెన్, 12 క్వింటాళ్ల మటన్, తలకాయ కూర, బోటీ వండించారు. వీటితో పాటు చేపలు, రొయ్యలతో కలిపి 86 రకాల వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఒకేసారి 500 మంది భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 8 వేల మందికి భోజనాలు పెట్టనున్నారు.