AKP: జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై శుక్రవారం అనకాపల్లిలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. జీఎస్టీ తగ్గడంతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గినట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి ఉపశమనం కలుగుతుందన్నారు.