మేడ్చల్: జిల్లా వ్యాప్తంగా చెరువులు అలుగు పారితే రోడ్లు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో దాదాపు 14 గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి. మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్, నాగిశెట్టిపల్లి, కేశవరం, పొన్నాల, అలియాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది.