ప్రకాశం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం, భైరవకోన, పాకలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.