KRNL: ఎమ్మిగనూరు నగర శివార్లలో ఉన్న సీసీఐ పత్తి కొనుగోళ్ల కేంద్రాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌కు పత్తి రైతులు వివరించారు. కలెక్టర్ స్పందించి స్లాట్ బుకింగ్‌లో వస్తున్న సాంకేతిక సమస్యలు, తేమశాతం వంటి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.