ప్రకాశం: అర్ధవీడు మండలంలోని వెలగలపాయ గ్రామంలో మిరప పంటను మంగళవారం ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక వర్షాల నేపథ్యంలో జరిగిన పంట నష్టంపై నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. అనంతరం వర్షం నుండి మొక్కలు కోలుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు.