MBNR: పీఎం జన్ మన్ కింద చెంచు కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని గండీడ్, హన్వాడ, మహబూబ్ నగర్ రూరల్, మహమ్మదాబాద్, నవాబుపేట మండలాలలోని 16 హ్యాబిటేషన్లలో 481 కుటుంబాలకు పథకాలు సంతృప్తికరంగా అందాలన్నారు.