ATP: కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడిపత్రిలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పెన్నా నది ఒడ్డున వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి, రాజ రాజేశ్వరి అమ్మవారిని MLA జేసీ అస్మిత్ రెడ్డి దర్శించుకున్నారు. అలాగే, సంజీవ్ నగర్లోని గాయత్రి అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని, ఆలయాల్లో జరిగిన ఆకాశ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.