ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు గురువారం విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు సమావేశాలు జరుగుతాయన్నారు. అధికారులు ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.