KNR: వీణవంక మండలం ఘన్ముక్ల మోడల్ స్కూల్ విద్యార్థినులు హుజురాబాద్ బాయ్స్ హైస్కూల్లో నిర్వహించిన SGF ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతిభ కనబర్చి అండర్ 14(శ్రీ చందన), 17(హర్షిక) విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు SGF సెక్రెటరీ వేణుగోపాల్ తెలిపారు.