BHNG: రామన్నపేట మండలం సిరిపురంలో ఇటీవల మృతి చెందిన చలమల శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. ‘చేయి కలుపుదాం! శ్రీనివాస్ కుటుంబానికి భరోసానిద్దాం’..!! అనే నినాదానికి ముందుకు వచ్చి తోచిన విధంగా గ్రామస్తులు ఖాతాకు డబ్బులు పంపించారు. అలా జమ అయిన రూ.94,317 లను మంగళవారం గ్రామ పెద్దలు శ్రీనివాస్ కుటుంబానికి అందించి మనోధైర్యాన్ని కల్పించారు.