RR: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుతో ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు గత రెండు సంవత్సరాల నుంచి గ్రామాల్లో సొంత నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టగా.. రిజర్వేషన్ల తారుమారుతో నాయకుల ఆశలన్నీ అడియాశలయ్యాయి.