ATP: తాడిపత్రిలో చింతల వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యప్రభ వాహనంపై శ్రీ చింతల వెంకటరమణ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. మండల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.