CTR: వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం దుండగులు నిప్పు పెట్టడం దారుణమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దురుద్దేశపూర్వక చర్యగా అభివర్ణించారు. ఇలాంటి హేమమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.