కాకినాడ: జిల్లా ఫారెస్ట్ అధికారిగా రామచంద్రరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అటవీశాఖ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. తమ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో అటవీ శాఖ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు.