BDK: అశ్వారావుపేట మండల చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని దిశ నిర్దేశం చేశారు.