ప్రకాశం: ఒంగోలులో కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన ఇవాళ నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.