MDK: ప్రశాంత వాతావరణంలో దుర్గ మాత నిమజ్జనాలు జరపాలని నర్సింగ్ ఎస్సై సృజన అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయని, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. నిమర్జనం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలను చెరువులు, కుంటలు వద్దకు తీసుకువెళ్లవద్దన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమర్జనం నిర్వహించాలన్నారు.