BDK: డైలీవెజ్ కార్మికులు శుక్రవారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని పీఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించేలా చూపాలని ఎమ్మెల్యేను నాయకులు రమేష్ కోరారు.