కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో కొలువై ఉన్న పల్లాలమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం అమ్మవారు మంగళ గౌరీ దేవి అలంకరణలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.