AP: రాజధాని అమరావతిలో పెట్టుబడులు, ఆర్థిక భాగస్వామ్యం కోసం మలేషియా బృందం పర్యటిస్తోంది. ఈ క్రమంలో వారు IPS అధికారుల భవన సముదాయాల పరిశీలించగా.. భవనాల పురోగతిని CRDA కమిషనర్ కన్నబాబు వివరించారు. ఈ నెల 5 వరకు అమరావతిలో పర్యటించనున్న ఈ బృందం చివరి రోజున పెట్టుబడులు, సామాజిక, ఆర్థిక భాగస్వామ్యాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ కానుంది.