ప్రకాశం: దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. ఒంగోలులో ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన దిశా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజ బాబు, శాసనసభ్యులు జనార్ధన్, ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..దిశచట్టం అమలుకు యావత్తు యంత్రాంగం కృషి చేయాలన్నారు.