మేడ్చల్: కూకట్పల్లి శంషిగూడ నుంచి అల్విన్ కాలనీకి వెళ్లే రోడ్డు దారుణంగా మారింది. గుంతలతో దెబ్బతిన్న రోడ్డు పై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమల సమస్య పెరిగి, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.