AP: విజయనగరం జిల్లాలో రేబిస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతిచెందాడు. సంతకవిటి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన లింగం నాయుడును ఆగస్ట్ 30న వీధి కుక్క కరవడంతో స్థానిక PHCలో 3 వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. అ తర్వాత కోలుకున్నా.. ఇటీవల ఆనారోగ్యానికి గురవడంతో రేబిస్ లక్షణాలు ఉన్నాయని విశాఖలోని ఓ అస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.