SKLM: జిల్లాలో భారీ వర్షాలకు మహేంద్ర తనయ నది నీటి మట్టం గురువారం రాత్రి ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో బారువా, మూలపాలెం గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన వద్ద పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన నవీన్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై హరిబాబు గ్రామస్తులు సహాయంతో నదిలో చిక్కుకున్న కార్మికుడి ని రక్షించారు.