BDK: మణుగూరు హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో బావి కూనవరం ప్రాంతానికీ చెందిన వనచర్ల శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రి వైద్య ఖర్చులతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నవనీత్, సుధీర్ ఆధ్వర్యంలో శుక్రవారం కిడ్నీ బాధితుడికి 16,000 ఆర్థిక సహాయం అందజేశారు.