SRPT: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరూ మృతి చెందిన సంఘటన, శుక్రవారం తెల్లవారుజామున తుంగతుర్తి మండలం బండ రామాపురం స్టేజి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.