GNTR: పాతగుంటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీ నియామకం ఇవాళ జరిగింది. ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ సమక్షంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పురాతన దేవాలయం అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాలకు నిధులు విడుదల చేసి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు.