AP: రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత CM చంద్రబాబుకే దక్కుతుందని హోంమంత్రి అనిత అన్నారు. DSCని అడ్డుకునేందుకు పలువురు కోర్టుల్లో కేసులు వేశారని, ఇలాంటి ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులను ఆమె కోరారు.