VZM: గాలి, వర్షం కారణంగా బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామంలో ఉన్న అరటి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చేతికి అందివచ్చిన పంట నీట మునగడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులను తీసుకునివెళ్ళి పంట నష్టాన్ని పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.