ATP: గుత్తి మండలం పెద్దోడ్డి గ్రామానికి చెందిన ఖాజాబీ అనే మహిళకు శుక్రవారం పాముకాటు వేసింది. ఖాజాబీ ఇంటిలో ఉన్న సమయంలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు వైద్యం చేసి, మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.