TG: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేడుకకు సినీ నటుడు నాగార్జున, సీపీఐ నేత నారాయణ, TJS నేత కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా రానున్నారు. రాజకీయ పార్టీల నేతల మధ్య ఐక్యత కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో దత్తాత్రేయ దీన్ని ప్రారంభించారు.