KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో వ్యక్తిని స్థానికులు తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.