నటుడు రాహుల్ రామకృష్ణ తన ‘X’ అకౌంట్‌ను డిలీట్ చేశారు. నిన్న X వేదికగా ఆయన వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేశారు. ముఖ్యంగా గాంధీ జయంతి రోజున ‘గాంధీ మహాత్ముడు కాదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదాస్పద ట్వీట్ల తర్వాత, రాహుల్ తన X ఖాతాను డీయాక్టివేట్/డిలీట్ చేశారు. దీని వెనుక గల కారణంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.