PDPL: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యమని రామగుండం కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. 15 రోజులుగా జరిగిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమం ముగింపున జరిపిన సమావేశంలో ఉత్తమ పారిశుద్ధ్య సేవలందించిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా శుభ్రతపనులు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.