TG: దసరా సెలవుల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఈ మూడు రోజులపాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు. పర్యటన ముగించుకొని, సోమవారం నుంచి కేటీఆర్ యథావిధిగా పార్టీ కార్యకలాపాలు, సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.