యాక్షన్ ప్రియులను అలరించడానికి ‘వార్ 2’ మరోసారి సిద్ధమైంది. 2019లో వచ్చిన ‘వార్’కు సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చిన ఈ మూవీ ఈనెల 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ సినిమాలో NTR, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు.