ASF: వాంకిడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ అధ్యక్షతన శుక్రవారం ఎన్నికల సన్నాహక సమావేశము నిర్వహించారు. సమావేశానికి జిల్లా కాంగ్రేస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు హాజరయ్యారు. నిబద్ధత గల కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలకే పోటీ చేసే అవకాశం కల్పించబడుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.