GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుప్పత్రాల గ్రామంలో గత రెండు రోజులుగా తాగునీరు సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దసరా పండుగ రోజున కూడా తాగునీరు లేకపోవడంతో గ్రామ ప్రజలు బోరు బావుల దగ్గరకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పండుగ అయిపోవడంతో ఇవాళ వంటల్లోకి నీరు లేదని స్థానికులు వాపోతున్నారు.