GDWL: అయిజ పట్టణానికి చెందిన రైతు గోపాల్ ఆదివారం పాము కాటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, గద్వాల ఆసుపత్రిలో సరైన చికిత్స లేకపోవడంతో అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ఇవాళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.