E.G: దేవరపల్లి గ్రామానికి చెందిన కోనాల లిన్సీ కర్నాటకలో జరిగిన 13వ జాతీయ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్–2025లో బంగారు పతకం గురువారం సాధించింది. ఆమెను కుటుంబ సభ్యులతో కలిసి ఎర్నగూడెం క్యాంపులో కలిసిన మాజీ మంత్రి తానేటి వనిత అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.