VZM: విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధంలో పైడిమాంబ అన్న విజయరామరాజు యుద్దానికి వెళుతుండగా వద్దని పైడితల్లమ్మ వారించారు. పంతానికి పోయి యుద్దానికి వెళ్లిన అన్న మృతివార్త విన్న పైడితల్లమ్మ పెద్ద చెరువులో దూకి ప్రాణత్యాగం చేసుకుంది. అనంతరం పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తి కలలో కనిపించి చెరువులో విగ్రహామై వెలసి ఉన్నానని చెప్పారు.