CTR: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలని జనసేన పార్టీ పెనుమూరు మండల అధ్యక్షులు, సొసైటీ ఛైర్మన్, EX ఆర్మీ పామూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం దేవళంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండుగులు నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వారు ఎంతటి వారైనా వారి వెనుకున్న వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు.