GNTR: తెనాలి నుంచి రేపల్లె వెళ్తున్న రైలు ఢీకొని వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. భట్టిప్రోలు మండలం పెనమర్రు గ్రామ శివారులో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. గ్రామ శివారులో వృద్ధురాలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు గమనించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం 108 ద్వారా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.