NTR: నందిగామ(M) పెద్దవరంలో శుక్రవారం నాన్ ఫెర్రస్ మెటల్ ఇండస్ట్రీకి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని పూజలు చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్ ఫెర్రస్ మెటల్ ఇండస్ట్రీ ప్రారంభమవడం వలన స్థానికంగా ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.